రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు

రూల్స్ బ్రేక్ చేసి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 నుండి  లాక్ డౌన్ మొదలైంది.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ కూకట్ పల్లి జేఎన్టీయూ వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. లాక్ డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మొదటిగా పెట్టిన లాక్ డౌన్ లో అనవసరంగా తిరిగే వారు ఎక్కువగా ఉన్నారు.. కానీ ఇప్పుడు ప్రజలకు అవగాహన వచ్చిందన్నారు. ప్రజలు అందరు లాక్ డౌన్ సందర్భంగా తమకి సహకరిస్తున్నారన్నారు. అత్యవసరంగా వెళ్లే వారు మాత్రమే రోడ్డుపై ఉన్నారన్నారు.  ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే ఈ సెకండ్ వేవ్ నుండి బయటపడతామన్నారు.